Printed on 23-09-2018 06:11:59 AM

రైలు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి
విజయనగరం:  ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాకు బయలుదేరారు. రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు.  దుర్ఘటన జరిగిన స్ధలాన్ని ఆయన పరిశీలించనున్నారు. 

రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి..:  రైలు ప్రమాదం గురించి తెలియగానే వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 
పెనుగంచిప్రోలుకు వైయస్ జగన్..బస్సు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి

Printed on 23-09-2018 06:11:59 AM

పెనుగంచిప్రోలుకు వైయస్ జగన్..బస్సు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి
హైదరాబాద్ః కృష్ణా జిల్లాలో  బస్సు ప్రమాద ఘటనపై వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్ర్భాంతి చెందారు. హుటాహుటిన పెనుగంచిప్రోలుకు బయలుదేరారు. బస్సు ప్రమాద ఘటన స్థలిని పరిశీలించి క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరులో ఘోర ప్రమాదం..వైయస్ జగన్ దిగ్భ్రాంతి

Printed on 23-09-2018 06:11:59 AM

చిత్తూరులో ఘోర ప్రమాదం..వైయస్ జగన్ దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మంది మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.

ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఓ లారీ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రుయా ఆస్పత్రికి తరలించారు



వైయస్ జగన్‌ దిగ్భ్రాంతి

Printed on 23-09-2018 06:11:59 AM

వైయస్ జగన్‌ దిగ్భ్రాంతి
హైదరాబాద్ః ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మృతిపట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నగరంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నిశిత్‌ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిశిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు. 
కారు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి

Printed on 23-09-2018 06:11:59 AM

కారు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి
పశ్చిమ గోదావరిః జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం కొవ్వలి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై  వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కొవ్వలిలో ఓ శుభకార్యానికి హాజరై  తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో డ్రైవర్‌తో సహా తొమ్మిదిమంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి వాసులుగా గుర్తించారు.
వైయస్ జగన్ దిగ్ర్భాంతి

Printed on 23-09-2018 06:11:59 AM

వైయస్ జగన్ దిగ్ర్భాంతి
అమరావతి : కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ శుక్రవారం విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు పంటను ధ్వంసం చేయకుండా పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుకూర్‌ బాషా, ఉప్పరి సుధాకర్‌, మద్దమ్మ, ప్రవల్లిక మృతిచెందగా.. మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కోవెలకుంట ఆస్పత్రికి తరలించారు.