Printed on 17-10-2018 05:34:00 AM

బి.బి.ప‌ట్నం నుంచి 232వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
 
 తూర్పు గోదావ‌రి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 232వ రోజు ప్రారంభమైంది. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న తనయుడు వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం బి.బి.పట్నం క్రాస్‌ నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గిడిజాం, ఎస్‌ అగ్రహారం మీదుగా డీజే పురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.  ప్రతిపక్షనేతకు మద్దతుగా ప్రజలు పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలు వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు.