Printed on 23-09-2017 18:31:01 PM

చవటపాళెంలో గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం
వెంకటాచలం: మండలంలోని చవటపాళెం గ్రామంలో నేడు గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం జరుగుతుందని ఆపార్టీ మండల కన్వీనర్‌ కరియావుల చెంచుకృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొని చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల గురించి ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు. ఈకార్యక్రమానికి మండలంలోని వైయస్‌ఆర్‌సీపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.