రాయలసీమ పేరెత్తే అర్హత టీడీపీకి లేదు 

 జస్ట్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని వస్తే జడుసుకుని జంప్ అయిపోయిన పిల్లిబిత్తిరి లోకేశం సీమకు చెందిన 49 మంది వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు చర్చకు రావాలని సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాడు. సీమ ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేసామని చెబుతున్నాడు. నోరు తెరిస్తే పులివెందుల పంచాయితీ, రాయలసీమ రౌడీయిజం అని కడుపులో కుళ్లంతా కక్కిన సంగతి మర్చిపోయి నేడు ఎన్నికలవేళ సీమమీద ప్రేమ కురిపించేస్తున్నాడు. 

అదే నిజం అయితే రాయలసీమలో టీడీపీని పాతిపెట్టి పాతరెందుకేసారో? పిచ్చి లోకేశం చెప్పలేడు. 

1997లో జీవో 69 ద్వారా శ్రీశైలం నీటి మట్టం తగ్గింపును మార్చి సీమకు తీరని ద్రోహం చేసింది బాబే అన్న విషయం ఎర్రిమాలోకం లోకేశానికి తెలీదేమో లోకానికి మాత్రం తెలుసు. 

2 టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయిర్ సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు పెంచింది వైయస్సార్ అయితే రెండేళ్ల కరోనా కాలాన్ని జయించి అవుకు రెండో టన్నెల్ విజయవంతంగా పూర్తి చేసింది వైయస్ జగన్. ఫాల్ట్ జోన్ లో 160 మీటర్ల పనులు వదిలేసింది టీడీపీ సర్కార్. 

అసలు అవుకు నుండి గండికోట మీదుగా పైడిపాళెంకు నీళ్లు చేరతాయి. ఈ పైడిపాళెం ప్రాజెక్టును 2006లో 667 కోట్లుఖర్చుతో 90%పూర్తి చేసింది వైయస్సారే. ఇప్పుడొచ్చి అవుకు ఘనత నాదే అంటాడు తింగరి పప్పునాయుడు. 

ఇక అడవిపల్లి రిజర్వాయిర్ నుండి పైప్ లైన్లద్వారా చిత్తూరుకి నీరిస్తానంటూ చంద్రబాబు హడావిడే తప్ప చేసింది శూన్యం. జగన్ ప్రభుత్వం 68కి.మీల పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం ద్వారా చిత్తూరు నగరవాసులకు తాగునీరు అందించేందుకు కోట్లాదిరూపాయిలు వెచ్చిస్తోంది. ఆ అడవిపల్లి రిజర్వాయర్ నుండి చుక్కనీరు తేకుండానే లోకేశం అదో విజయంలా టీడీపీ ఖాతాలో వేసుకుంటున్నాడు. 

ఇక గండికోట సీబీఆర్ లో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 10 టీఎంసీలు నిల్వ చేసింది వైయస్ జగన్ హయాంలోనే. గండికోట రిజర్వాయిర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు అయితే బాబు హయాంలో గరిష్టంగా 3 టీఎంసీలు మాతమే నిల్వ చేసారు. కారణం నిర్వాసితుల పునరావాసం నిర్లక్ష్యం చేయడం.  బాబు ఐదేళ్ల కాలంలో పునరావాసానికి ఖర్చుచేసింది కేవలం రూ.146 కోట్లు మాత్రమే. వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 522 కోట్లు పునరావాసం కోసం విడుదల చేయడమే కాక, ఇళ్లనిర్మాణం, మౌలికవసతుల కల్పన, భూసేకరణకు సైతం 403 కోట్లను మంజూరు చేసింది. 17,809 మంది నిర్వాసితులకు పూర్తి స్థాయి పునరావాసం కల్పించింది. 

పులికనుమ ఎత్తిపోతల నీరు లేక వెలవెల పోయిందంటూ బాబుహయాంలో ఈనాడు పదే పదే చెప్పుకొచ్చింది. చంద్రబాబు కరువు కవల పిల్లలు కనుక పులికనుమ ద్వారా కర్నూలు రైతాంగానికి బాబు చేసింది లేకపోగా కరువుకోరల్లో అన్నదాతలు అల్లాడారు. మరి దీన్నే తమ గొప్పతనం అని పిచ్చి పులకేశం లోకేశం భావిస్తున్నాడా?

తుంగభద్ర నుండి నీటిని ఎత్తిపోసేందుకు 2008లో వైయస్సార్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పులకుర్తి ఎత్తిపోతల. దాన్ని అసంపూర్తి పనులతో, లీకేజీలు, సాంకేతిక సమస్యలతోనే ఆర్భాటంగా పదేపదే ప్రారంభోత్సవాలు చేసాడు చంద్రబాబు. 

10 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు రిజర్వాయిర్ నిర్మించింది వైయస్సార్. దాన్ని కనీసం పట్టించుకోకుండా సీపేజ్ సమస్యను కూడా పట్టించుకోకుండా వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఎక్స్ పర్ట్ కమిటీ సూచనలను కనీసం పాటించనేలేదు. పునరావాసం కూడా కల్పించలేదు. నేడు ఫొటోలకు ఫోజుల్లో మాత్రం గోరుకల్లు కట్టిందే టీడీపీ అన్న చందంగా చంద్రన్న కొడుకు పప్పన్న బిల్డప్ ఇస్తున్నాడు. 

సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులును ఇవ్వక నిర్లక్ష్యం చేసిన బాబు రాయలసీమ రైతులకు రెయిన్ గన్ లంటూ పిట్టలదొర కబుర్లు చెప్పాడు. బాప్ ఏక్ నెంబరీ బేటా దశ్ నెంబరీ అన్నట్టు ఆ అయ్యను మించిపోయి డప్పులు కొడుతూ జబ్బలు చరిచే లోకేశాన్ని చూసి రాయలసీమ రైతాంగం ఛీకొడుతోంది.

Back to Top