చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు
18 Oct, 2019 12:01 IST
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మానసిక సమతుల్యాన్ని కోల్పోయారని వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. కుమారుడు నారా లోకేశ్ తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని చంద్రబాబు ఆశించారని... కానీ, లోకేశ్ విఫలం చెందడంతో ఆయన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని పేర్కొన్నారు. మహిళలు, గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.