పేదల సంక్షేమమే సీఎం వైయస్ జగన్ ధ్యేయం
18 Nov, 2019 18:47 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు, తోకమీడియాకు కనిపించడం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో నవరత్నాలు సంపూర్ణంగా అమలవుతున్నాయని, పేదల సంక్షేమమే సీఎం వైయస్ జగన్ ధ్యేయమన్నారు. పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అల్లాడుతుంటే వైయస్ జగన్ రైతు భరోసా పథకం కింద రూ.13,500 ఇస్తుంటే తోక మీడియాకు, ప్రతిపక్షానికి కనిపించడం లేదన్నారు. ఆటో డ్రైవర్ల గురించి చంద్రబాబు, ఆయన పత్రిక ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు తన తొత్తులైన జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నాని లాంటి వ్యక్తులను పార్లమెంట్‌కు పంపించారని విమర్శించారు.
Read Also: ఇంగ్లిష్ మీడియంలో చదివితే మతమార్పిడి జరుగుతుందా..?