ఎన్‌ఐఏ విచారణ అంటే ఎందుకంత భయం బాబూ..?
ప్రకాశం:ఎన్‌ఐఏ విచారణ చేపడితే చంద్రబాబుకు ఎందుకంత భయమని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టిడిపి నాయకులు, చంద్రబాబు నాయుడి విమర్శలు చూస్తుంటే ఈ కేసులో చంద్రబాబు సహా పలువురి పాత్ర ఉందని అర్ధమవుతోందన్నారు.రాష్ట్ర పెద్దల ప్రోద్బలంతోనే వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు.పెన్షన్లను పెంచడం రాజకీయమే అని,చిత్తశుద్ధితో చంద్రబాబు అమలు చేస్తారనే నమ్మకం లేదన్నారు. పురందేశ్వరి వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చే విషంయం తనకు తెలియదని, వస్తే ఆహ్వానిస్తామన్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మా పార్టీలోకి వస్తానంటే తీసుకోం అని తెలిపారు. సంక్రాంతి కల్లా వెలిగొండ ప్రాజెక్టు నీళ్లిస్తామని చంద్రబాబు ప్రకటించినా ఇంతవరకు పనులు కూడా జరగలేదని మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఏడాదిలోగా వెలిగొండ పూర్తిచేసి, నీటి సమస్యను తీరుస్తామని తెలిపారు.