టిడిపి అక్రమాల పై ప్రచారం చేస్తాం- సినీనటులు కృష్ణుడు, పృథ్వీ
విశాఖపట్నం: అన్నివర్గాల ప్రజలు ఆదరణ ఉన్న ఏకైక నేత వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ నేతలు పృథ్వీ, కృష్ణుడుఅన్నారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబుకు గొప్ప విజన్ ఉందని నాడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారని, సమస్యలపై అధికారపక్షాన్ని కాకుండా విపక్షాన్ని నిలదీస్తారా..అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాలు బీజేపీతో ఉన్నారని, అలాగే పవన్‌కల్యాణ్ గతంలో టీడీపీతో ఉన్నారన్నారు.చంద్రబాబు,పవన్‌కల్యాణ్ జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలు అమాయకులు కాదని ప్రతి విషయం పరిశీలిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కామన్‌మేన్ విప్లవం రాబోతుందన్నారు.ప్రజల చేతుల్లో ఉన్న డిజిటల్ విప్లవం ద్వారానే తెలంగాణలో చంద్రబాబు ఓటమి చవిచూశారన్నారు.చంద్రబాబుకు ఎన్ని నాలుకలు ఉన్నాయో ప్రజలందరికి తెలుసున్నారు.ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ తన వైబ్‌సైట్ నుంచి తొలగించిందన్నారు.మేనిఫెస్టో తీసేసిన మాత్రాన ప్రజలను మోసం చేయలేరన్నారు.చంద్రబాబు చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు అసహనసం పెరిగిపోయిందన్నారు.కాకినాడలో ఒక మహిళపై చంద్రబాబు దుర్భాషలాడటం పద్దతి కాదన్నారు.గతంలో కూడా వివిధ వర్గాలను తీవ్రపదజాలంతో దూషించారన్నారు.వీధి నాటకాల ద్వారా ప్రజల ముందుకు వెళ్ళీ టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడతామన్నారు.ఏపీలో అవినీతి,అక్రమాలు,అడ్డగోలు దోపిడీ సాగుతుందన్నారు. ఓటుకు నోటు అంశాలపై రోడ్‌షోలతో ప్రచారం చేస్తామన్నారు. టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తండ్రికి మించిన తనయుడుగా వైయస్ జగన్ సువర్ణ పాలన చేస్తారన్నారు.