ఏపీలో విచ్చలవిడి అవినీతి..
శ్రీకాకుళంః చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. రూ.ఆరులక్షల 17వేల 585 కోట్ల అవినీతికి చంద్రబాబుకు పాల్పడ్డారన్నారు.దేశంలోనే చంద్రబాబు వంటి అవినీతి చక్రవర్తి ఎవరు లేరని చెప్పడానికి అవినీతి చక్రవర్తి పుస్తకమే ఇందుకు సాక్ష్యమన్నారు.చంద్రబాబు శ్వేతప్రతాలు విడుదల చేస్తున్నారని,దమ్ముంటే అవినీతి చక్రవర్తి పుస్తకంలో ఉన్న అంశాలను చంద్రబాబు ఖండించాలన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియా పేర్కొందన్నారు.రెండు ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు.దీనిపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు.ఏపీలో విచ్చలవిడిగా అవినీతి సాగుతుందన్నారు.పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.నాలుగున్నరేళ్ల కాలంలో పోలవరంలో టెంకాయ కొట్టి ప్రాజెక్టు పూర్తయిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.