వైయస్ భారతితో మహేష్ బాబు సతీమణి నమ్రత భేటీ
25 Oct, 2019 17:56 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతితో సినీ హీరో మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం నివాసంలో భారతిని కలిసిన నమ్రత అరగంట పాటు పలు విషయాలపై చర్చించారు. మహేష్‌బాబు ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేయాలని నమ్రత కోరినట్లు సమాచారం.