సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదు

14 Nov, 2019 11:38 IST

అమరావతి: ఎవరైనా బ్రీఫ్ చేస్తే తప్ప దేనిపై ఎలా విమర్శించాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతుబట్టనట్టుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో చదివించండని 'నిత్య కళ్యాణం' అనడం చూస్తుంటే... ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివింది ఎంత నిజమో తెలిసిపోతుందని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Read Also: పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అందిస్తే తప్పేంటి?