ఇంగ్లిష్ మీడియం ప్రతి విద్యార్థి హక్కు
11 Nov, 2019 11:16 IST
అమరావతి: ఇంగ్లిష్ మీడియం చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధించాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బలహీనవర్గాల వారిని ఇంకా ఎంతకాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు బాబూ?’ అని ప్రశ్నించారు.