చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ తో పవన్ షో
4 Nov, 2019 12:31 IST
అమరావతి: 'చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ షో చేశారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇసుక కొరత పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్... విశాఖపట్నంలో లాంగ్ మార్చ్‌పై ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేశారు.
రాజకీయాల్లో ‘కాల్షీట్’ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయతీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి చూడొద్దట. ఈ మాట ప్రజలను అడుగుతున్నావా?' అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Read Also: పవన్ సినిమా హీరో అయితే..వైయస్ జగన్ రియల్ హీరో