చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు
22 Oct, 2019 12:13 IST

అమరావతి: వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు వైఖరిపై ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు నదులు ఎప్పుడు ఎండిపోయి, ఇసుక తిన్నెలు తేలి కనిపించాలన్నారు. ఆ ఇసుక దోచుకుని 10 వేల మంది కోటీశ్వరులయ్యారన్నారు. జలాశయాలన్నీ నిండితే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు.