అర్హులందరికీ సంక్షేమ పథకాలు
8 Nov, 2019 17:46 IST
నగరి: గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైనవారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం ఏఎంపురంలో రూ.38 లక్షల అంచనా వ్యయంతో నూతన గ్రామ సచివాలయ భవనానికి ఎమ్మెల్యే రోజా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన గుమ్మం ముందుకే వచ్చిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైయస్ జగన్ ధ్యేయమన్నారు.