వైయస్‌ జగన్‌ గ్రామ రాజ్య పాలన..మరో రామరాజ్య పాలన

11 Dec, 2019 16:02 IST

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ గ్రామ రాజ్య పాలన..మరో రామరాజ్య పాలన కాబోతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర పేర్కొన్నారు. గ్రామ సచివాలయం, వాలంటీర్లతో ప్రజల వద్దకే పాలన వచ్చిందన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశారు. వారి బాధలు విన్నారు. అప్పుడే చెప్పారు..నేను ఉన్నాను..నేను విన్నానని చెప్పారు. అధికారంలోకి రాగానే మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారు. ఆగస్టు 15న గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ, అక్టోబర్‌ 2న గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ వ్యవస్థలు దేశానికే ఆదర్శం. ప్రజలకు దగ్గరగా ఉండే ఈ వ్యవస్థ. ప్రజల సమస్యలు, ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందుతుంది. అందరికి సమ న్యాయం జరుగుతుంది. అవినీతిరహిత పాలన సాధ్యమవుతుంది. ఒక కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే ఇప్పుడు అలాంటి కష్టాలు లేవు. ఇలాంటి పాలన తెచ్చిన వైయస్‌ జగన్‌కు ప్రజలందరూ రుణపడి ఉంటారు. నిరుద్యోగ సమస్యను వైయస్‌ జగన్‌ పరిష్కరించారు. నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌దే. 

Read Also: నాలుగు లక్షల ఉద్యోగాలు దేశ చరిత్రలో మొదటిసారి