అన్యమత ప్రచార ఆరోపణలపై చర్చకు సిద్ధమా..?
తాడేపల్లి: ప్రభుత్వాన్ని, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అన్యమత ప్రచారం అంటూ చేస్తున్న ఆరోపణలపై పాట్నర్స్ ఇద్దరూ చర్చకు సిద్ధమా అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాలు విసిరారు.
బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టే విధంగా ఎక్కడా పొంతన లేకుండా వీరిద్దరూ మాట్లాడుతున్నారని, బ్రిటీష్ వారు విభజించి పాలించు పాలసీని నల్ల దొరలు చంద్రబాబు, పవన్‌లు అనుసరిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ. 234 కోట్లు మొదటి బడ్జెట్లో కేటాయించిన ఘనత సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్‌లు సీఎంపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వకుండా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ సీఎం వైయస్ జగన్ ఐదు నెలల పాలనలోనే అందిస్తున్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో సున్నితమైన మతపరమైన అంశాలను తెరమీదకు తెచ్చి ప్రభుత్వంపై, వైయస్ జగన్‌పై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్, ఇతర రాజకీయ పార్టీలు ఆరోపలు చేస్తున్నాయి.
నవరత్నాలు అమలు చేస్తూ.. మొదటి కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ మీటింగ్‌లో 19 బిల్లులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ప పాలన గురించి తెలుసుకొని ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు చూస్తున్నాయి. అటువంటి తరుణంలో సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కోలేమని వంకతో 40 ఏళ్ల ఇండస్ట్రీ, వారి పాట్నర్ పవన్ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు ఇసుక దీక్ష అని చేశారు. గత వారం రోజులుగా ఇసుక కావాల్సినంత సరఫరా చేస్తున్నాం. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది చంద్రబాబు దీక్షకు రాలేదు. ఎమ్మెల్యేల మద్దతే లేదు కానీ ప్రజల మద్దతు ఉందని చెప్పుకునే ధోరణిలో చంద్రబాబు ఉన్నాడు. రాజ్యసభలో ఉన్న ఎంపీలంతా బీజేపీలోకి చేరారు. ఉన్న ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంద్రబాబు టీడీపీని కూడా బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తూ.. సీఎం వైయస్ జగన్‌పై మతపరమైన ఆరోపణలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ టీడీపీ చేయిస్తుంది.
తిరుమల కొండపై శిలువ, తిరుమల బస్సు టికెట్ వెనుక అన్యమతప్రచారం. సీఎం వైయస్ జగన్ గంగానదిలో మునిగి మోసం చేశాడు అని, వైయస్ జగన్ తిరుమల ప్రసాదం స్వీకరిస్తారో లేదో..పవన్. భవానీ ఐల్యాండ్‌లో ఘోరాలు అని కన్నాలక్ష్మీనారాయణ, అన్నవరంలో అన్యమత ప్రచారం, శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు, గుంటూరులో దుర్గగుడి కూల్చేశారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై చంద్రబాబు, పవన్ చర్చకు వస్తానంటే దేవాదాయ శాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నాను.
తిరుమలలో శిలువ అని సోషల్ మీడియాలో చూశారు.. సోలార్ ప్యానల్‌ను శిలువ అని మత ప్రచారం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ భవానీ ఐల్యాండ్‌లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిర్మాణం చేసిన తోరణం చూసి వైయస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశాడు. తిరుపతి బస్సు టికెట్లలో అన్యమత ప్రచారాలు అంటున్నారు. ఆ టికెట్లు ముద్ర గత ప్రభుత్వంలో జరిగింది. గుంటూరులో గుడి కూల్చేరారని దుష్ప్రచారం చేస్తున్నారు. గుడి కోసం స్థలం ఇచ్చారు. నిర్మాణం కూడా పూర్తయింది. పూజారికి, కమిటీకి ఉన్న విభేదాలతో కావాలని యాగి చేస్తుంటే మళ్లీ అదే గుడికి స్థలం కూడా కేటాయించాం. ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు, పవన్ చివరికి మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం నీచమైన చర్య. రూ.234 కోట్లు హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి కేటాయించిన మొదటి ప్రభుత్వం వైయస్ జగన్‌ది. అటువంటి వ్యక్తిపై మతం బురదజల్లేందుకు ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.
Read Also: బాబు దేవాలయాలు కూలదోస్తే..సీఎం వైయస్ జగన్ నిర్మిస్తున్నారు