ఏపీని అప్పుల ఊబిలో నెట్టింది చంద్రబాబే

25 Nov, 2019 16:03 IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం బాగుపడుతుంటే అది చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్‌ అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో మంత్రి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల్లోనే మేనిఫెస్టోలోని అంశాలను 80 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు చూసి చంద్రబాబు, పవన్‌ తట్టుకోలేకపోతున్నారన్నారు. దత్తపుత్రుడు పవన్‌ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

Read Also: కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్న లోకేష్‌