మహిళలందరికీ పవన్‌ క్షమాపణ చెప్పాలి

4 Dec, 2019 15:53 IST

అమరావతి:  పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని, మహిళలందరికీ పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందనడం సరికాదని మండిపడ్డారు. ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా అని ప్రశ్నించారు.  మహిళల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు.

Read Also: మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకన