మార్కెట్ యార్డుల్లో ‘నాడు–నేడు
తాడేపల్లి: రైతును అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేశారని, ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వారికి అండగా నిలుస్తున్న సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులకు ఏం కావాలో తెలుసుకొని ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే ఏకైక సీఎం వైయస్ జగన్ అని అన్నారు. రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిçస్తున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పేరుతో ఒక అధికారిని నియమించాం. అయితే వ్యవసాయ అసిస్టెంట్ లేదంటే హార్టికల్చర్ అసిస్టెంట్ కాదంటే సెరీ కల్చర్ అసిస్టెంట్ ఎవరో ఒకరు ఉంటారు. సచివాలయంలో కాకుండా వ్యవసాయ వర్క్‌షాపులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఆదేశం.
వ్యవసాయానికి సంబంధించి మన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన ఉత్పత్తులను, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం అన్నీ ఒకేసారి చేస్తున్నాం కాబట్టి క్షేత్రస్థాయిలో నియమించిన సిబ్బందికి, అధికారికి అవగాహన కల్పించాలని చెప్పారు.
అన్ని గ్రామాల్లో రైతులకు మౌలిక వసతులు గురించడంతో పాటు ప్రతి మండలం, నియోజకవర్గ కేంద్రాల్లో అవసరమైన కెపాసిటీలో గోదాములు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రాంతంలో ఏ రకమైన పంటలు పండిస్తారు. ఎంత సామర్థ్యం కలిగిన గోదాములు అవసరం అనేది గుర్తించాలని,
రైతులు నష్టపోకుండా ఎక్కడైనా ధర పడిపోయే పరిస్థితి ఉంటే తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రకారం మొక్కజొన్న కొనుగోలు కేందరాలను ఏర్పాటు చేశారు. ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు అమ్మడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు మొక్కజొన్న కొనుగోలు ఏర్పాటు చేశాం.
వేరు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు దళారీల చేతుల్లో మోసపోకముందే ఏర్పాటు చేయాలన్నారు. టమాట ధర పడిపోయినప్పుడు ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేసి వారే కొనుగోలు చేసి రైతు బజార్‌లకు సరఫరా చేయడంతో రైతుకు భరోసా వచ్చింది.
చిరుధాన్యాలకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి సీఎం వైయస్ జగన్.. చిరుధాన్యాలను ప్రోత్సహించాలని స్పష్టమైన ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. చిరుధాన్యాల ప్రోత్సహం ఏ విధంగా ఉండాలి. ఏ రకమైన ధాన్యాలు వస్తున్నాయో తెలుసుకోవాలన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో మార్కెట్‌లోకి వచ్చిన తరువాత ఇబ్బంది లేకుండా ముందు నుంచే సాగు ఖర్చును పరిగణలోకి తీసుకొని, తక్షణమే కొనుగోలు ధరను నిర్ణయించాలని ఆదేశించారు. విప్లవాత్మకంగా సాగువ్యయాన్ని ఖరారు చేసి దాన్ని రైతుకు గిట్టుబాటు వచ్చేలా కొనుగోలు ధర నిర్ణయించాలన్నారు.
చీని తోటల ఉత్పత్తి వచ్చినప్పుడు మార్కెటింగ్ టెక్నిక్స్ వల్ల రైతులు నష్టపోయేవారు.. దళారులు ధరలు తగ్గించడం, సూట్ అని కొంత ఉచితంగా తీసుకోవడం చేసేవారు.. దీనిపై సమీక్షించి చీని మార్కెట్‌ను స్థిరీకరించేందుకు ఒక విధానాన్ని ప్రకటించాలని సీఎం ఆదేశించారు.
అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలపై కూడా చర్చ జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఉండేలా మొత్తం రీఆర్గనైజ్ చేయమని చెప్పారు. 207 మార్కెట్ కమిటీలు రాబోతున్నాయి. ఇప్పుడున్న కమిటీలతో పాటు కొన్నిచోట్ల అదనంగా కమిటీలు వస్తున్నాయి. ఇవే కాకుండా అదనంగా ఏమైనా అవసరం అయితే అధ్యయనం చేసిన తరువాత ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్ యార్డులన్నింటినీ అభివృద్ధి చేసేందుకు మార్కెట్ యార్డు నాడు – నేడు కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రైతుబజార్‌లను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. కొన్ని చోట్ల రైతులు కానివారు అమ్ముతున్నారు. రైతుబజార్‌లు వినియోగదారులకు అనుకూలంగా లేవని, కొత్తగా కావాలనే డిమాండ్ ఉంది. నూతనంగా మరో 56 రైతుబజార్‌లను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులకు సంబంధించి ఏవిధంగా సౌకర్యాలు కల్పించాలనేది ఆలోచించాలన్నారు.
బయో ప్రొడక్ట్స్ పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి వస్తున్నాయి. మన రాష్ట్రంలో రూ.400 కోట్ల మార్కెట్ ఉన్నట్లుగా అంచన, దీనిపై చర్చ జరిగినప్పుడు భవిష్యత్తులో బయో ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ యాక్టు తీసుకురావాలని నిర్ణయించారు. ఇది చాలా కీలకమైన నిర్ణయం. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సారం ఉందో లేదో తెలియకుండా బయో ప్రొడక్ట్స్ పేరుతో పెద్ద ఎత్తున అంటగట్టే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మన ల్యాబ్‌లలో పరీక్ష చేసిన తరువాతే ధర నిర్ణయించి మార్కెట్‌లోకి పంపించాలని చర్చించారు.
కోతులు, జింకలు, ఏనుగుల వల్ల రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నారని సమాచారం ఉంది. అటవీ శాఖ అధికారులను కూడా ఈ సమావేశానికి రప్పించి వారితో సీఎం మాట్లాడారు. నియంత్రించాలంటే ఏం చేయాలి. లేదంటే నష్టపోయిన రైతుల కోసం ఏం చేయాలనే స్పష్టమైన ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీలకు కోడిగుడ్లు కొనుగోలు విషయంపై చర్చ జరిగింది. ఎక్కడ వీలైతే అక్కడ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా టెండర్లు పిలవాలని ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.