చంద్రబాబు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుంది

11 Dec, 2019 11:09 IST

అసెంబ్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది.బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సభకు నాయకత్వం వహించి సభను చక్కగా నడిపిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. సీనియర్‌గా వ్యహరించాల్సిన తీరు సరిగా లేదు. సభలో జరిగిన పరిణామాలను యావత్‌ ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం.సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలోనడిపిస్తున్నారు. మహానేత వైయస్‌ఆర్‌ కలలను నెరవేర్చే అవకాశం వచ్చింది. అందరం మర్యాదగా నడుచుకోవాలి. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది. సభకు చంద్రబాబు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుంది. 

Read Also: చంద్రబాబు సేవలు చాలు..ఇక రెస్టు తీసుకోవచ్చు