మద్దిశెట్టి వేణుగోపాల్ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
హైదరాబాద్: ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వేణుగోపాల్ పార్టీలో చేరారు. ఆయనకు వైయస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టబోయే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని పేర్కొన్నారు.
దర్శి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చిన వైయస్ జగన్‌కు వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సలహాలు, సూచనల మేరకు పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సహకారంగా ఉంటానని, పార్టీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వేణుగోపాల్ పేర్కొన్నారు.