తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి
6 Nov, 2019 18:31 IST
అమరావతి : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో నం. 180 ద్వారా బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.