అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
25 Oct, 2019 11:29 IST

విజయవాడ: వరదలపై ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. వరదలు, జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకరస్థాయిలో ఉన్న చెరువుల వద్ద రింగ్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.