గొల్లపూడి మృతిపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
12 Dec, 2019 16:52 IST
అమరావతి: ప్రముఖ రచయిత, సినీ నటులు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారన్నారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో గొల్లపూడి అందరినీ ఆకట్టుకున్నారని సీఎం వైయస్ జగన్ గుర్తుచేశారు.