రాఘవాచారి మృతికి వైయస్‌ జగన్  సంతాపం 

28 Oct, 2019 11:30 IST

అమరావతి:  ప్రముఖ పాత్రికేయుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ రాఘవాచారి మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాఘవాచారి విలువ ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని  సీఎం వైయస్‌ జగన్ కొనియాడారు. రాఘవాచారి రచనల్లో  విలువ ఆధారిత జర్నలిజం ప్రతిబింబిస్తుందన్న వైయస్‌ జగన్.. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

Read Also: చంద్రబాబు తానా.. పవన్‌ తందానా