వైయస్‌ఆర్ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు
16 Oct, 2019 15:55 IST
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితులై పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వైయస్‌ఆర్ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కృష్ణంరాజు పార్టీలో చేరారు. కృష్ణంరాజుకు సీఎం వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అల్లూరితో పాటు జనసేన, టీడీపీ నేతలు వైయస్‌ఆర్ సీపీలో చేరారు.