నేడు వైయస్ఆర్ ‘లా’ నేస్తం పథకం ప్రారంభం
3 Dec, 2019 10:32 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో, పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలు చేశారు. ఇవాళ జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ లా నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభిస్తారు. కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు..వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. 2016, ఆ తర్వాత ‘లా’ పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు ఈ పథకానికి అర్హులు.
Read Also: వైయస్ జగన్ దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు