సీపీఎస్ విధానం రద్దు చేస్తాం
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు నష్టదాయకమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్‌ను తుర్లాం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగులు కోరారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ టీటీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు, ఏపీలో మాత్రం సీపీఎస్ రద్దుపై స్పందించడం లేదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరో మూడు నెలలు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. వైయస్ జగన్ హామీతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.