కౌలురైతులకు గడువు పెంపు

12 Nov, 2019 14:44 IST

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కౌలు రైతులకు గడువు పెంచుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకంపై సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్‌ 15తో రైతులకు గడువు పూర్తవుతుందన్నారు. కౌలు రైతులకు డిసెంబర్‌ 15వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రతి గ్రామంలో సోషల్‌ ఆడిట్‌ జరగాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ గిరిజన పక్షపాతి