గాజువాక యువత భవిష్యత్ బాధ్యత నాది!

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసిపి వ్యతిరేకం

గంగవరం కాలుష్యాన్ని తగ్గిస్తాం

యువతతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ వెల్లడి

గాజువాక : గాజువాక యువత భవిష్యత్తు బాధ్యత తనది అని స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం తాను ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో 'విజయవారధి' పేరుతో యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని అమర్నాథ్ తెలియజేశారు.స్థానిక గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్ లో 'గాజువాక రైజింగ్' పేరుతో గాజువాక యూత్ ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని అమర్నాథ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షాలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం పై విభసెలు ఆరోపణలు చేస్తూ వచ్చారని, అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యంగా యువత ఈ రెండు ప్రభుత్వాలలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన వాస్తవికతను గమనించాలని అమర్నాథ్ సూచించారు. 2014-19 మధ్య రాష్ట్రానికి 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో 1, 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అమర్నాథ్ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర మొత్తం మీద 70000 మంది ఉద్యోగాలు వస్తే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వంలో 1, 58, 000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామ సచివాలయాలలో మరో రెండు లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో పోర్టులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక్క కొత్త ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, అదే తాను ఐటీ మంత్రిగా రెండేళ్ల కాలంలో ఇన్ఫోసిస్, అదాని డేటా సెంటర్, హెచ్ సి ఎల్ , కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా కంపెనీ విస్తరణ, ఏటిసి టైర్ల కంపెనీ వంటి అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని అమర్నాథ్ పేర్కొన్నారు. అచ్చుతాపురంలో భారీ పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖలో దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఇనార్బిట్ మాల్ను నిర్మిస్తున్నామని వీటన్నిటి వల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని. అమర్నాథ్ చెప్పారు గాజువాక ఆటోనగర్లో పొల్యూషన్ పెరిగిపోవడం వలన దాన్ని అనకాపల్లి ప్రాంతానికి తరలిస్తున్నామని, రాంబిల్లి లో 2300 ఎకరాలలో, అనంతపురంలో 155 ఎకరాలలో, గుర్రంపాలెంలో 155 ఎకరాలలో కొత్త ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని అమర్నాథ్ తెలియజేశారు. 

ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు స్థానిక యువత వ్యాపార రంగంలో స్థిరపడాలన్న, అందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు.
యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో వారిని అనుసంధానం చేస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు కనెక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా చాలామంది యువకులు వ్యాపారాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారికి కూడా చేయూత అందించేందుకు చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ పేర్కొన్నారు. ఎఎస్ఎంఈలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.  

గాజువాకలో ఒకేషనల్,  డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీరి కోసం డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. తనను గెలిపిస్తే గాజువాకలో పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్ల అభివృద్ధికి సంబంధించి మూడు నెలల్లో ఆడిట్ చేసి, వీటిని అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని చెప్పారు. గాజువాక ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను, యాప్ను, వెబ్సైట్ ని కూడా సిద్ధం చేస్తామని చెప్పారు.

గాజువాకలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పాత గాజువాక నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని,  తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి తొలి పునాదిరాయి వేసేది దీనికేనని అమర్నాథ్ హామీ ఇచ్చారు. అగనంపూడి టోల్గేట్ ను తొలగించే విషయమై ఎంత పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమర్నాథ్ వివరించారు. గాజువాక ప్రాంతం మీదుగా మెట్రో రైల్ నిర్మాణానికి రెండున్నర సంవత్సరాల క్రిందట ప్రణాళిక సిద్ధం చేశారని,  ఇప్పటివరకు దానికి దిక్కు లేదని అమర్నాథ్ అన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మెట్రో పునాది వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు గాజువాకలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. గాజువాకలో మార్కెట్లను ఆధునికరిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామన్నారు. గాజువాకలో  గెడ్డలన్నిటికీ రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామన్నారు. గంగవరం పోర్టు పొల్యూషన్ పై టాస్క్ ఫోర్స్ లేదు అని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పొల్యూషన్ తగ్గిస్తానని అమర్నాథ్ చెప్పారు.

ఇదిలా ఉండగా క్రీడాకారులను ప్రోత్సహించి వారి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో అగ్రస్థానంలో నిలిచేలా వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం గాజువాక ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. నేరాల నియంత్రణకు గాజువాక నగరంలో ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు నిర్మి ఏర్పాటు చేస్తామని అమర్నాథ్ తెలియజేశారు. యారాడను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తానని అమర్నాథ్ చెప్పారు. ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకమేనని దీనిపై ఎటువంటి పోరాటాల కైనా తమ సిద్ధంగా ఉంటామని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొంది.

Back to Top