పావలా వడ్డీ

పావలా వడ్డీ కార్యక్రమం గ్రామీణ మహిళల చిన్న వ్యాపారాలు మరియు వ్యవస్థాపకత ప్రోత్సహించడానికి 3% వడ్డీ రుణాలు ఇచ్చింది.

ప్రతి మహిళలనూ లక్షాధికారిగా చూడాలనే వైఎస్సార్ ఆశయానికి రూపం పావలవడ్డీ రుణాలు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అన్నగా వైఎస్ అందించిన ఆపన్న హస్తం అది. మహిళా సాధికారత దిశగా వైఎస్ వేసిన అడుగులవి. వడ్డీ వ్యాపారుల నుంచి రూపాయి నుంచి పదిరూపాయిల వడ్డీకి తెచ్చిన రుణాలు తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కుటుంబాలను బయట పడేసేందుకు వైఎస్సార్ పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఏటా ఇందుకోసం బడ్జెట్ లో పెద్ద మొత్తం కేటాయించారు. ఐదేళ్ల లోనే 85లక్షల మంది మహిళలకు 7000 కోట్ల రూపాయిలను పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా అందించారు. వివిధ వర్గాల ప్రజలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పావలా వడ్డీ రుణాల ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించారు. తమ కాళ్లపై తాము నిలబడేలా కుటుంబానికే దిక్సూచిలా మహిళలను నిలిపిన ఘనత వైఎస్ తెచ్చిన పావలావడ్డీ పథకానిదే. ఇదే పథకాన్ని తరువాత రైతులకూ వర్తింప చేసారు వైఎస్

Back to Top