ధైర్యంతో అడుగులు ముందుకేద్దాం 

కేసరిపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలిసిన కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాలతో సహా పలువురు సీనియర్‌ పార్టీ నేతలు.

దాడి ఘటన తర్వాత మేమంతా సిద్ధం… బస్సు యాత్ర పునః ప్రారంభం

ముఖ్యమంత్రి నుదుటి గాయంపై గురించి వాకబు చేసిన పార్టీ నేతలు.

సీఎం యోగక్షేమాలు స్వయంగా తెలుసుకున్న నేతలు.

అందరినీ చిరునవ్వుతో పలకరించిన ముఖ్యమంత్రి.

జననేత మోముపై చెదరని చిరునవ్వు

పరామర్శకు వెల్లువెత్తిన నాయకులు, కార్యకర్తలు

దాడులతో ప్రయాణాన్ని ఆపలేరన్న జననేత

విజ‌య‌వాడ‌: దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి  వైయస్.జగన్‌పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 

ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం జరగడంతో కేసరపల్లి క్యాంపునకు పెద్ద ఎత్తున నాయకులు , కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని  ముఖ్యమంత్రితో అన్నారు. 

ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నాయకులతో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు. 

బస్సుయాత్రలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి ఆయన సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూలనుంచి పలువురు నాయకులు తరలివచ్చారు.

ముఖ్యమంత్రిని శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, మంత్రులు జోగిరమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని,  ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, ఒంగోలు ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్ధి దేవినేని అవినాష్‌, మైలవరం అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు సహా పలువురు ఇతర నేతలు క‌లిసి ప‌రామ‌ర్శించారు.

 

Back to Top