వైయస్ జగన్‌ను కలిసిన నూతన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
తాడేపల్లి: నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఎన్నికపై వైయస్ జగన్ గారి నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
వైయస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో బార్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి, నూతన బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసుల రెడ్డి (ఏపీ హైకోర్ట్), రోళ్ళ మాధవి (ఏపీ హైకోర్ట్), వెంకట్రామి రెడ్డి కొవ్వూరి (ఏపీ హైకోర్ట్), రామిరెడ్డి ఆలూరు (అనంతపురం), బ్రహ్మారెడ్డి వట్టిజొన్నల (గుంటూరు), క్రిష్ణారెడ్డి బి.వి (ఏలూరు) పాల్గొన్నారు.