సీఎం వైయస్‌ జగన్‌ను చూసి గర్వపడుతున్నా

27 Jan, 2020 17:41 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి చాలా గర్వపడుతున్నానని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తాత్కాలిక లబ్ధి కోసం తాను నమ్ముకున్న విలువలను, సిద్ధాంతాలను వదులుకోకుండా తానేంటో మరోసారి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరూపించుకున్నారని అభినందించారు. తన పద్ధతి, నీతి, విలువలే ముఖ్యమని నమ్మిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన, విలువలతో కూడిన రాజకీయాలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు తెలుసు అంటూ వైవీ సుబ్బారెడ్డి ట్వీట్‌ చేశారు.