ఇడుపులపాయలో వైయస్ఆర్‌కు వైవీ సుబ్బారెడ్డి నివాళులు
2 Sep, 2022 15:04 IST
వైయస్ఆర్ జిల్లా: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. మహానేత సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ రాష్ట్రానికి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైవీ సుబ్బారెడ్డి స్మరించుకున్నారు.