వైద్యుల సేవలు వెలకట్టలేనివి
విశాఖ: మనిషి రూపంలోని దేవుళ్లుగా వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని వైయస్ఆర్‌సీపీ ఉమ్మడి విశాఖ జిల్లాల కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ నగరంలో నిర్వహించిన నేషనల్ డాక్టర్స్ డే వేడుకల్లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. కరోనా విలయకాలంలో తమ ప్రాణాలను పణంగాపెట్టి డాక్టర్లు పోరాడారని కొనియాడారు. మన దేశంలో ప్రతి ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తుండటం ఆనవాయితీ. భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ఆ రోజును డాక్టర్స్ డే పాటించే సంప్రదాయం మూడు దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సమాజంలో డాక్టర్లు చేస్తోన్న సేవలు, కృషి గురించి ప్రత్యేక కార్యక్రమాలు, చర్చ జరగడం, వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుదామని చెప్పారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు.