మహిళా క్రికెటర్ ఎండీ షబ్నమ్‌ను అభినందించిన వైవీ సుబ్బారెడ్డి
9 Feb, 2023 12:08 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మహిళా క్రికెటర్ ఎండీ షబ్నమ్‌ను అభినందించారు. విశాఖలో ఎండీ షబ్నమ్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి తాను సాధించిన మెడల్స్ చూపించారు. ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా అభినందించి, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విశాఖ పట్నానికి చెందిన ఎండీ షబ్నమ్ కూడా అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించుకుంది. గత నెలలో ముంబై వేదికగా జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది