కోవిడ్‌లోనూ వైయస్ జగన్ సంక్షేమం అందించారు
వైయస్ఆర్ జిల్లా: కోవిడ్ సమయంలో కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను ప్రజలకు అందజేశారని వైయస్ఆర్‌సీపీ వైయస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోను దైవంగా భావించి పథకాలను పేదలకు వైయస్ జగన్ అందించారని గుర్తు చేశారు. హామీల అమలులో బాబు, వైయస్ జగన్‌లకు చాలా తేడా ఉందని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలో చంద్రబాబు విఫలమయ్యడని కడప ఎంపీ విమర్శించారు. ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు. 2019లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేదని తెలిపారు. అప్పుడు రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉండేదని, రెండు సంవత్సరాలు కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందన్నారు. స్థానిక టీడీపీ నాయకులు జూదాలు, ముగ్గురాయి దొంగతనాలతో చాలా బిజీగా ఉన్నారని విమర్శించారు. వారి దృష్టి అంతా ప్రజలకు మంచి చేయడాన్ని పక్కన పెట్టి ధనార్జనపైనే ఉందన్నారు.