వైయస్ఆర్ సీపీ కార్యకర్తపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాడి
22 Apr, 2025 12:05 IST

అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బరితెగింపు చర్యలకు దిగారు. తాడిపత్రిలో వైయస్ఆర్ సీపీ కార్యకర్త షేక్షావలి పై జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైయస్ఆర్‌సీపీలో తిరుగుతావా అంటూ విచక్షణారహితంగా టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త షేక్షావలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జేసీ వర్గీయుల చర్యలను వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.