వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై పచ్చ గూండాల దాడి
23 Apr, 2026 12:51 IST
పల్నాడు జిల్లా: పెద్దకూరపాడు నియోజకవర్గంలో మరోసారి పచ్చమూకలు రెచ్చిపోయారు. ఇళ్ల మధ్యలో నడుస్తున్న బెల్ట్ షాపును తొలగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు. కస్తల గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ఆదామ్ జానీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, బెల్ట్ షాపు తొలగించాలని కోరిన నేపథ్యంలో వివాదం చెలరేగి, అది దాడికి దారితీసిందని చెబుతున్నారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన నేత మాణిక్యరావు రాడ్‌తో దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆదామ్ జానీని స్థానికంగా చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.