ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు
విశాఖ: ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఉప్పాల హారికపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. `కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం.కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం.రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది. ఒక జిల్లా ప్రధమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు దీనికేం సమాధానం చెబుతారు. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టు లో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది` అని వరుదు కళ్యాణి ఓ ప్రకటనలో హెచ్చరించారు.