టీడీపీ వుయ్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
11 May, 2024 22:32 IST
తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన We అనే app పట్లయువత అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ సూచించారు. ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.వాటిని దగ్గర ఉంచుకుని టిడిపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ఓటర్ స్లిప్ తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్ ను టిడిపి మేనిఫెస్టో ను ఇస్తూ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.
- ఓటర్లను ప్రబావితం చేస్తూ బార్ కోడ్ స్లిప్ స్కాన్ చేసిన అనంతరంవారికి ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యవహరిస్తోంది
- ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ సమాచారం అంతా సేకరించారు
- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా ఈ డేటాను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పంపారు
- చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలోనే పార్టీ యంత్రాంగం సమగ్ర సమాచారం తీసుకున్నారు
- ఆ యాప్ ఓపెన్ చేస్తే అందులో ఒక బార్ కోడ్ కూడా ఉంటుంది. ఆ బార్ కోడ్ ఓపెన్ చేస్తే ఓటర్ కు సంబంధించి ప్రతి సమాచారం కనపడతుంది.
- తద్వారా ఆ ఓటర్ ను ప్రలోభపరచడానికి తెలుగుదేశం పార్టీ పధకం వేసింది.
- బార్ కోడింగ్ ను ఉపయోగించి ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపే కుట్ర చేసింది
- దీనిపై ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు తీసుకోవాలి
- ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్నాతెలుగుదేశం పార్టీ దురాగతం గురించి ఈ సీ సరైనరీతిలో పట్టించుకోవటం లేదు
- ఇప్పటికే దీనిపై ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం.
- We app వాడే వారిపై నిఘా పెట్టాలని,అవసరమైతే వారి గురించి ఎన్నికల సంఘానికి తెలియచేయాలని కూడా ప్రజలను కోరుతున్నాం
- కనీసం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల కమీషన్ ను కోరుతున్నాం.
- -ముఖ్యంగా యువత ఇలాంటి యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ ఇలాంటి యాప్ లు వాడవద్దు
- పోలీసుల కేసులలో ఇరుక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.