మహిళలు ఓటుతో చంద్రబాబుకు బుద్దిచెపుతారు
8 May, 2024 23:12 IST
తాడేపల్లి: చంద్రబాబుకు మహిళలు ఓటుతో బుద్ధి చెబుతారని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. ఓటమి భయంతో మహిళలపై దాడులు చేయిస్తున్న చంద్రబాబు భరతం పడతామన్నారు. బుధవారం మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
- - నిన్న సాక్షాత్తు హోమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారు.నేడు మాచర్లలో ఎంఎల్ఏ సతీమణి రమాపై,ఎచ్చర్లలో జడ్ పి టి సి హేమమాలిని రెడ్డిని దుర్భాషలాడారు.విజయవాడలో బొండా ఉమా నేతృత్వంలో దళిత మహిళలపై దాడి జరిగింది.
- - వైయస్ఆర్‌సీపీ కి చెందిన మహిళలపై తెలుగుదేశం నేతలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం దాడులకు తెగబడ్డారు.
- - మహిళలను పోలింగ్ కు రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది.
- - మహిళల్లో వైయస్ జగన్ గారికి ఆదరణ ఉందని తెలుసుకుని ఈ విధమైన దాడులు చేయిస్తున్నారు.
- - మాచర్లలో పిన్నెల్లి గారి సతీమణి పలువురు మహిళలతో కలసి శిరిగిరిపాడులో ప్రచారం చేస్తుండగా టిడిపి అభ్యర్ది జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలమేరకు దాడులకు తెగబడ్డారు.
- - వంద మంది టీడీపీ గూండాలు రమాగారి పై దాడి చేయటం దారుణం. ఆమెతోపాటు పలువురు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
- - క్రిమినల్ నేచర్ కలిగిన జూలకంటి బ్రహ్మారెడ్డిీ......మహిళలపై దాడికి ఉసిగొల్పారు.
- - చంద్రబాబు ఆలోచనలతోనే ఇలాంటి దాడులు రాష్ర్ట వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ మహిళలపై జరుగుతున్నాయి.
- - మహిళల పై టీడీపీ నేతల ప్రతాపం ఏంటి.మహిళలపై దాడులు చేస్తే వారికి ఓటు దెబ్బలు, చెప్పు దెబ్బలు తప్పవు
- - నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో ఉన్న హోమ్ మంత్రి పైనే టిడిపి గూండాలు దాడి చేశారు
- - ప్రచారంలోఉన్న మహిళలపై దాడులు చేసి వైయస్ఆర్‌సీపీ నేతలను భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు
- - మీ మ్యానిఫెస్టో ద్వారా గెలవలేక...టెర్రరైజ్ చేయడం ద్వారా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు
- - ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని టీడీపీ కుట్ర చేస్తుంది
- - మహిళలు పోలింగ్ బూత్ కు వస్తే ఆ ఓటు ఖచ్చితంగా ఫ్యాన్ కే పడుతుందని అర్దమైపోయింది
- - 31లక్షలమంది మహిళలకు ఇంటి స్దలాలు ఇచ్చారు,చేయూత,ఆసరా,అమ్మఒడి పధకాలతో మహిళ హృదయాలలో జగన్ నిలిచిపోయారు.
- - మహిళాలోకం అంతా వైయస్సార్సిపిని గెలిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు
- - మహిళలు ఓట్లు ఎటూ తనకు వేయరని తెలుసుకుని చంద్రబాబు ఓటమి ఖాయం అని తెలుసుకుని ఇలా చేస్తున్నారు.
- - మాచర్ల లో ఎమ్మెల్యే అభ్యర్థి భార్య పై దాడి చేయడం వంటి దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు కె వస్తాయి
- -చంద్రబాబుకు స్పష్టం చేస్తున్నాం...నీవు ఇలాంటి దాడులకు తెగబడినా మహిళలు ఎవ్వరూ భయపడరు.
- - మహిళలు పిడుగుల్లా వచ్చి జగన్ గారికే ఓట్లు వేస్తారు.. మహిళలు ఓటుతో బుద్దిచెపుతారు
- .
- - ఎచ్చర్ల నియోజకవర్గంలో జడ్ పి టిసి సభ్యురాలు హేమమాలిని రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేయబోతే పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు.