ముద్దనూరు వైస్ ఎంపీపీ–2 పదవిని కైవసం చేసుకున్న వైయస్ఆర్‌సీపీ
వైయస్ఆర్ జిల్లా: ముద్దనూరు మండలంలో జరిగిన వైస్ ఎంపీపీ–2 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యతను చాటుకుంది. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఇంద్రాణి వైస్ ఎంపీపీ–2గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి ఇంద్రాణిని హృదయపూర్వకంగా అభినందించారు. పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఇంద్రాణి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ ఎన్నికల విజయం ముద్దనూరు మండలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. మండల అభివృద్ధి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా ఇంద్రాణి స్పష్టం చేశారు.