కార్యకర్తలే పార్టీకి వెన్నెముక

10 Jan, 2026 12:09 IST

పశ్చిమ గోదావరి జిల్లా :  కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. ప్రజల మధ్య నిత్యం ఉండి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ పోరాడే శక్తి కార్యకర్తలకే ఉందని పేర్కొన్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని, వారి శ్రమకు తగిన గౌరవం, గుర్తింపు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. భీమవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం  నిర్వహించారు. ఈ సమావేశం చిన్నిమిలి వెంకట రాయుడు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు హాజరయ్యారు.ఈ  సందర్భంగా పార్టీని గ్రామ, బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై నేతలు దృష్టిసారించారు. కార్యకర్తల సమన్వయంతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మించి, రానున్న రోజుల్లో ప్రజల మధ్య మరింత బలంగా నిలబడేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నేతలు స్పష్టం చేశారు.

ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పార్లమెంట్ సెక్రటరీ పేరిచర్ల నరసింహరాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు జిల్లా కొండయ్య, వీరవాసరం మండల అధ్యక్షులు చవ్యాకుల సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ రామరాజు, సీనియర్ నాయకులు ఎ.ఎస్. రాజు, కోడె యుగంధర్, యువజన విభాగ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్, వైయ‌స్ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు డీవీడీ ప్రసాద్, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ మానుకొండ ప్రదీప్, రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ ఉమా శంకర్తో పాటు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.