మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం

22 Jan, 2026 15:25 IST

తిరుప‌తి:  శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామ‌ని, అందుకోసం నిర్వీరామంగా ప‌ని చేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షతన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విస్తృతస్థాయి సమావేశం 
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణంలో భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని వార్డు, పంచాయతీ స్థాయి అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి బూత్‌, ప్రతి గడప వరకు పార్టీ బలాన్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలనలో ప్రజలకు అందిన మేలు, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేస్తూ ప్రజల్లో నమ్మకం మరింత పెంచాలని సూచించారు.  సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టే వ్యూహాలపై విస్తృతంగా చర్చించగా, అందరూ ఏకగ్రీవంగా జగనన్న నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి రావాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యక్షులు ఎంఎల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంఎల్సీ సిపాయి సుబ్రమణ్యం, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు భూమన అభినయ్ రెడ్డి, విజయానంద రెడ్డి, చెవిరెడ్డి మోహిత్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, నూకతోటి రాజేష్, డాక్టర్ సునీల్, వెంకట గౌడ, చవ్వా రాజశేఖర్, మేయర్ డాక్టర్ శిరీష, తదితర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.