జగనన్న చేదోడు పథకంపై ఎల్లో బ్యాచ్ విషప్రచారం
తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న చేదోడు పథకంపై చంద్రబాబు, ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తుందని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ అధికారంలో వచ్చినప్పటినుంచి జగనన్న చేదోడు పథకం అమలులోకి తెచ్చారని చెప్పారు. ఈ పధకం ద్వారా వరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మందికి 325 కోట్ల రూపాయలను అందించారు. నాలుగు సంవత్సరాలలో 1252.52 కోట్ల అందించారని చెప్పారు. అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల వృత్తి దార్లకు వారి ఖాతాలలో ఒక్కొక్కరికి 10 వేల చొప్పున జమ చేశారు.
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని ఎప్పుడూ చెప్పే వైయస్ జగన్.. వారికోసమే ఈ పథకం అమలు చేస్తున్నారు. చేదోడు పథకం గురించి తప్పడు వార్తలు రాస్తున్నారు.ఎన్నికలలో బిసిలంతా వైయస్ జగన్ గారికి అండగా నిలవాలని నిర్ణయించుకునేటప్పటికి ఏమిచేయాలో పాలుపోని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.
వృత్తి పరమైన విధానాలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ పథకం తెచ్చారు. చంద్రబాబు పచ్చమీడియా కలసి చేదోడు పధకం గురించి విషప్రచారం చేస్తున్నారు. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి వేశారు.లబ్దిదారులు సైతం పచ్చమీడియా రాతలపై మండిపడుతున్నారు. ఐదు సంవత్సరాలలో రైతు భరోసా కింద 34,228 కోట్లు లబ్ది చేకూరింది. 2014 లో ప్రజలను చంద్రబాబు 8 రకాలుగా మోసం చేసాడు. ఈ రోజు నోటికి వచ్చిన హామీలు చంద్రబాబు ఇస్తున్నాడు.డానికి ఏడాదికి లక్ష 50 వేల కోట్లు అవసరం అవుతుంది. మొన్నటివరకు ఉచితాలు ఇస్తే మన రాష్టం శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు రాష్టాన్ని ఏం చేయాలనీ అనుకుంటున్నాడు.ప్రజలకు సమాధానం చెప్పాలని గౌతంరెడ్డి డిమాండు చేశారు.