గీతాంజలి కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండ
16 Apr, 2025 16:42 IST
గుంటూరు: తెనాలిలో ఐటీడీపీ వేధింపులకు బలి అయిన గీతాంజలి కుటుంబానికి మరోసారి వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. బుధవారం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ రూ.50 వేల నగదును అందజేశారు. కాగా, తెనాలి మహిళ గీతాంజలి కుటుంబానికి వైయస్ జగన్ రూ.20 లక్షల పరిహారం అందించిన విషయం విధితమే. మరోసారి వైయస్ఆర్‌సీపీ నేతలు ఆర్థికసాయం అందించడం పట్ల ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.