రషిద్ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండ
పల్నాడు: వినుకొండ టౌన్ నడి రోడ్డులో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. రషీద్ మృతదేహన్ని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా నిలబడతామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. రేపు ఉదయం 9.00 గంటలకి మాజీ ముఖ్యమంత్రి , వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించేoదుకు వినుకొండకు వస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.